గుంతకల్లు: గంజాయి అక్రమంగా రవాణా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు, గుంతకల్లు వన్ టౌన్ సీఐ మనోహర్ హెచ్చరిక
గుంతకల్లులో గంజాయి రవాణా చేసిన విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ మనోహర్ హెచ్చరించారు. సీఐ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గుంతకల్లులో రైళ్ల ద్వారా గంజాయి రవాణా జరుగుతున్నట్లు గుర్తించామని వన్ టౌన్ సీఐ బి.మనోహర్ తెలిపారు. గంజాయి వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి రవాణా చేస్తే 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఏడు కేసులు నమోదు చేశామన్నారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు, పేర్లను గోప్యంగా ఉంచుతామని సీఐ ఇచ్చారు.