ఆత్మకూరు పట్టణంలో పెట్రోల్ డీజిల్ కొరకు రెండో రోజు కొనసాగుతున్న వాహనాల రద్దీ
ఆత్మకూరు పట్టణంలో పెట్రోల్ బంకుల వద్ద రెండవ రోజు శుక్రవారం భారీ రద్దీ నెలకొంది. సోషల్ మీడియాలో రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా ఉండదనే పుకార్లే ఈ పరిస్థితికి కారణమయ్యాయి. వాహనదారులు ఒక్కసారిగా బంకులకు పోటెత్తడంతో ఆత్మకూరు–కర్నూలు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.గత రెండు రోజులుగా వాట్సాప్ గ్రూపుల్లో ఇంధన కొరతపై తప్పుడు సందేశాలు వైరల్ అవుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. చాలామంది తమ వాహనాల ట్యాంకులను నింపుకోవడంతో పాటు బాటిళ్లలో కూడా పెట్రోల్ నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించారు. పట్టణంలోని ప్రధాన పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపించాయి.