విశాఖపట్నం: ఓజోన్ పొర పరిరక్షణ మానవాళి బాధ్యత
- డాక్టర్ ఇ ఉదయభాస్కర రెడ్డి, విశ్రాంత ఆచార్యులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం
ఓజోన్ పొర పరిరక్షణ మానవాళి బాధ్యత అని ఆంధ్ర విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ఇ ఉదయభాస్కర రెడ్డి వివరించారు. విశాఖపట్నం ఎంవిపి కాలనీలోని డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన అంతర్జాతీయ ఓజోన్ డే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఓజోన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణా మండలి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకం అన్నారు. అత్యంత పలుచగా ఉండే ఈ పొరను కాపాడుకోకపోతే జరిగే నష్టం వర్ణనాతీతం అన్నారు.