ఆపరేషన్ మొబైల్ షీల్డ్ కింద పోగొట్టుకున్న, చోరీ అయిన మొబైల్స్ను బాధితులకు అప్పగించడంలో కడప జిల్లా పోలీసులు కీలక పాత్ర పోషించారు. రూ.1.86 కోట్ల విలువైన 702 మొబైల్ ఫోన్లను బాధితులకు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మంగళవారం అందజేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్క్ నిఘా, డేటా విశ్లేషణా పద్ధతులు ఉపయోగించి భారీ మొత్తంలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు.