కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ నేతన్న భరోసా పథకం అమలు చేయాలని బాలయ్య పిఏకు చేనేతల వినతి
చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేనేత కార్మి కులకు కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీగా 200యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పిన నేతన్న భరోసా పథకం వెంటనే అమలు చేయాలని హిందూపురంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద చేనేత కార్మికులు ఎమ్మెల్యే బాలయ్య పిఏ వీరయ్యకు వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలయ్య వీరయ్య త్వరలోనే చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక సభ్యులు. దేవరాజు, బాబు సాబ్, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.