సిద్దిపేట అర్బన్: సిద్దిపేట అర్బన్ తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన ఎమ్మార్పీఎస్ విహెచ్పిఎస్ నాయకులు
రాష్ట్రంలోని పింఛన్ దారులకు ఒక్కొక్కరికి 40 వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉందని.. 20 నెలలు గడిచినా పింఛన్ డబ్బులు పెంచకుండా దివ్యాంగులను, చేయూత పెన్షన్ దారులను ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. దివ్యాంగులకు 6 వేల రూపాయలు పెన్షన్ పెంచడంతో పాటు ఇతర ఫించన్ దారులకు 2000 నుంచి 4000 రూపాయలు పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్, విహెచ్పిఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో దివ్యాంగుల పెన్షన్ ఇతర పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చి 20 నెలలు గడిచినా..