గుంతకల్లు: గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో పండ్ల తోటల పెంపకంపై రైతులకు అవగాహన, పండ్ల తోటలతో పర్యావరణ పరిరక్షణ
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని కొత్తపేట గ్రామం శివారులోని హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యాలయం ఆవరణలో పండ్ల తోటల పెంపకంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గురువారం జరిగిన కార్యక్రమంలో హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎం. నారాయణ స్వామి మాట్లాడుతూ మన ప్రాంతంలో ఉష్ణోగ్రతను బట్టి వ్యవసాయ మొక్కలు పెంపు కోసం అడవి మొక్కలను కూడా నాటుకోవాలన్నారు. యాజమాన్య పద్ధతులతో పండ్ల తోటల వ్యవసాయం చేయాలన్నారు. హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ, సే ట్రీస్ సంయుక్తంగా కలిసి నాణ్యమైన మామిడి, నేరేడు, చినీ, నిమ్మ మొక్కలను రైతులకు ఉచితంగా అందజేశామన్నారు.