పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో జలదిగ్బంధం: గర్భిణిని రక్షించిన అధికారులు
భారీ వర్షాలతో అన్నవరం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకోగా, 9 నెలల గర్భిణిని, డయాలసిస్ రోగిని అధికారులు బోటు ద్వారా రక్షించి ఆసుపత్రికి తరలించారు. వెంకటరమణ కాలనీలో 20 కుటుంబాలను తరలించారు. గాదరాడలో కాలువలో కొట్టుకుపోయిన కారులోని వారిని స్థానికులు కాపాడారు.