స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని జై పంగులూరు పంచాయతీలో ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి హాజరైన అధికారులు
Ongole Urban, Prakasam | Mar 28, 2026
జెపంగులూరు గ్రామపంచాయతీలో శనివారం జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు . ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నెలా మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం వ్యక్తిగత మరియు గ్రామం పరిశుభ్రత పైనే ఆధారపడి ఉందని తెలియజేశారు. స్వచ్ఛ రధం ప్రారంభించి ప్రజలు పొడి చెత్తను ఈ వాహనానికి ఇచ్చినిత్య అవసర సరుకులు తీసుకో వచ్చని తెలిపారు