దుద్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం. ఎమ్మార్పీఎస్ నాయకుడు కనక నాగన్న మృతి
కొత్తపల్లి మండలం దుద్యాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు కనక నాగన్న (50) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భువనాసి వాగు బ్రిడ్జి వద్ద బైక్‌పై వెళ్తున్న సమయంలో ఆయన కిందపడి తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదంలో గాయపడిన నాగన్నను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. మృతుడిని కనక నాగన్నగా పోలీసులు గుర్తించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ చేపట్టారు.