గుంతకల్లు: పట్టణ శివార్లలో సమ్మర్ స్టోరేజ్ రిజర్వాయర్ లో ఈతకు వెళ్లి నీట మునిగి సుదీప్ అనే బాలుడు మృతి
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివార్లలోని సమ్మర్ స్టోరేజ్ రిజర్వాయర్ లో ఈతకు వెళ్ళి నీట మునిగి సుదీప్ అనే బాలుడు మృతి చెందాడు. పోలీసులు, అగ్నిమాపక శాఖ సహాయ అధికారి అశ్వర్థ తెలిపిన శుక్రవారం తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు పట్టణంలోని శ్రీనివాస నగర్ కు చెందిన లావణ్య, ఆంజనేయులు దంపతుల కుమారుడు సుదీప్ స్నేహితులతో కలిసి పట్టణ శివార్లలో ఉన్న రిజర్వాయర్ లో ఈతకు వెళ్లి లోతు ఎక్కువగా ఉన్న చోట దీపక్ గల్లంతయ్యాడు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు.