అనంతపురం జిల్లా గుత్తి మండలం పరిధిలోని ఎంగిలిబండ గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం ద్విచక్రవాహనాన్ని బొలెరో వాహనం ఢీకొని ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం ఇసురాళ్లపల్లి గ్రామానికి చెందిన బింగివెంకట్రాముడు కుమారుడు బింగిరంగస్వామి, సూర్యుడు కుమారుడు పవన్ కుమార్ లు గుత్తి పట్టణంలో వివాహ వేడుకకు హాజరయ్యారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బొలెరో ఢీకొని ఇద్దరు మృతి చెందారు.