ధర్మపురి: జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ విజేత మామిడిపెల్లి గణేష్‌కు ఘన సన్మానం
మధ్యప్రదేశ్‌లో జరిగిన జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో విజయం సాధించిన మామిడిపెల్లి గణేష్‌ను నేరేళ్ల ఆదర్శ విద్యాలయం యాజమాన్యం సన్మానించింది. విద్యార్థులకు శిక్షణ ఇస్తూ, వారిలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్న గణేష్ గారి సేవలను పాఠశాల యాజమాన్యం కొనియాడింది.