కాకినాడ రూరల్: కాకినాడ: ప్రమాదకరంగా మారిన తూరంగి రోడ్డు, అధికారులను వేడుకుంటున్న స్థానికులు
కాకినాడ రూరల్ తూరంగి గోపికృష్ణ కాలనీ నుంచి బొడ్డు చెరువు వెళ్లే రహదారిపై డ్రైనేజీ నిర్మాణ సామగ్రిని వదలడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తరచూ జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, వెంటనే సామగ్రిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.