అగళి లో యూరియా కోసం రైతుల క్యూ. క్యూ లైన్ లో అరుపులు కేకలు.
అగలి మండలం బ్యాడిగెర గ్రామంలో యూరియా కోసం రైతులు రైతు సేవ కేంద్రం వద్ద బుధవారం ఉదయం భారీగా తరలివచ్చారు. సుమారు వెయ్యి మంది వరకు రైతులు రావడంతో భారీ క్యూ లైన్ ఏర్పడింది. ప్రస్తుతం రైతు సేవ కేంద్రంలో యూరియా 250 బస్తాల వరకు స్టాక్ ఉందని త్వరలో స్టాకు తెప్పించి ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.