హిందూపురంలో గీతా పారాయణ పోటీల్లో ప్రకాశించిన చిన్నారులు
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో గీతా పారాయణ పోటీల్లో ప్రకాశించిన చిన్నారులు చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో డీవీడీబీఎస్ చిన్మయ విద్యాలయ లో ఇటీవల నిర్వహించిన భగవద్గీతా పరాయణ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో డీబీ కాలనీలోని ప్రసన్న వేణి వేదమాలిక ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి అందరి ప్రశంసలు పొందారు. సంస్థ నిర్వాహకురాలు శ్రీమతి నాగవేణి మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన విద్యార్థులు పాఠశాల స్థాయి, పట్టణ స్థాయి, జిల్లా స్థాయి పోటీల్లో విజయాలు సాధించి ఇప్పుడు రాష్ట్రస్థాయికి అర్హత సాధించారు.