మహిళలకు అండగా వైఎస్ఆర్ ఆసరా, మహిళల రుణ విముక్తే సీఎం లక్ష్యం: సైదాపురంలో జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ
తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలంలో వైయస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్‌రెడ్డితో కలిసి జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్ర పటానికి వారు పాలాభిషేకం చేశారు. మహిళల రుణ విముక్తే సీఎం జగన్ లక్ష్యమని తెలిపారు. పొదుపు సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించి అభినందించారు.