నగరంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉరేసుకొని ఆదిత్య ఫార్మసీ కంపెనీ ఎండీ ఆత్మహత్య
విజయవాడ అయోధ్య నగర్ లోని క్షత్రియ భవన్ లో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిత్య ఫార్మసీ కంపెనీ ఎండి సాగి వెంకట నరసింహారాజుగా పోలీసులు గుర్తించారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక బాధలు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు, కుటుంబీకులు చెబుతున్నారు. ఘటన స్థలం చేరుకున్నది సింగినగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.