శ్రీశైలం: శ్రీశైలం వెబ్ సైట్లో సాంకేతిక సమస్య. టికెట్లు బుకింగ్ లో తీవ్ర అంతరాయం. ఇబ్బందులు గురవుతున్న భక్తులు
శ్రీశైల దేవస్థానం అధికార వెబ్సైట్లో అంతరాయం ఏర్పడింది. srisailadevasthanam.orgలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆన్లైన్ టికెట్ల బుకింగ్కు అంతరాయం ఏర్పడింది. భక్తులు బుక్ చేసిన టికెట్లు డౌన్లోడ్ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వెబ్సైట్ బుకింగ్ హిస్టరీలో సైతం టికెట్లు కనిపించడం లేదు. దీంతో పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపాన్ని సరిచేసి సేవలని పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు.