శ్రీశైలం: శ్రీశైల నియోజకవర్గానికి చెందిన 58 మంది లబ్ధిదారులకు 30 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా
పేదలకు సీఎం సహాయనిధి నిజమైన వరంగా మారిందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. ఆదివారం వేల్పనూరులో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 58 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.30 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్క అర్హుడికి సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే సమయంలో ఈ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.