గుంతకల్లు: గుత్తి అర్ఎస్ జెడ్పీ ఉన్నత పాఠశాల 2000-2001 పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక, సరదాగా గడిపిన స్నేహితులు
అనంతపురం జిల్లా గుత్తి అర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000-2001 సంవత్సరంలో పదవతరగతి చదివిన పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక ఆదివారం జరిగింది. గుత్తి పట్టణంలోని పారిశ్రామిక వాడ సమీపంలో ఉన్న సునామ జకని మాత ఆలయ ఆవరణలో ఉన్న కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సంగర్భంగా పాఠాలు చెప్పిన గురువులను సన్మానించారు. అంతకు ముందు వారు చదివిన పాఠశాలలో 25 వసంతాలు పూర్తి అయిన తరువాత తిరిగి అందరూ కలుసుకుని తరగతి గదులలో తిరుగుతూ ఆనాటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పాఠశాలలో చదువుకున్న వారు ఒకరికొకరు ప్రేమగా, ఆప్యాయంగా పలకరించుకున్నారు.