గుంతకల్లు: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన శ్రీనివాసులు ఆత్మహత్యాయత్నం, గుత్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గుత్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యసమస్యలతో పాటుగా కుటుంబ సమస్యలతో బాధ పడుతుండేవాడు. పలు ఆసుపత్రులలో చికిత్సలు చేయించుకున్నా వ్యాధి నయం కాలేదు. దీంతో ఆత్మహత్య చేసుకున్నాడు.