జమ్మికుంట: పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ మేదరి వాడాలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
జమ్మికుంట: పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ మేదరి వాడలోని దుర్గామాత ను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శుక్రవారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు కాలనీవాసులు అందరిని చల్లగా చూడాలని మొక్కుకున్నట్లు తెలిపారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 9వ సంవత్సరం దుర్గామాత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు.