అనకాపల్లి: అనకాపల్లిలో 13 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడి అరెస్ట్
అనకాపల్లిలో 2011 నాటి పాత కేసులో నాన్-బెయిలబుల్ వారెంట్ ఎదుర్కొంటున్న నిందితుడు ఓం ప్రకాశ్ యాదవ్‌ను టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.