పటాన్చెరు: గడ్డపోతారం మున్సిపాలిటీ చౌదరి గూడెం గ్రామంలో నీట మునిగి వ్యక్తి మృతదేహం లభ్యం
గడ్డపోతారం మున్సిపాలిటీ చౌదరి గూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాండురంగ ప్రమాదవశాత్తు లింగం చెరువులో మునిగి మృతి చెందారు. ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం చెరువులో గాలింపు చర్యలు చేపట్టి ఆదివారం మధ్యాహ్నం మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ఆసుపత్రి తరలించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగారు.