మడకశిరలోకి కర్ణాటక మద్యం రాకుండా గట్టినిగా ఉంచాలని సూచించిన అధికారులు.
మడకశిర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్ స్టేషన్ ను జిల్లా డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్య, జిల్లా ఏపీ ఈ ఎస్ శ్రీరామ్ శనివారం తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా స్టేషన్లో రికార్డులు పరిశీలించారు.అనంతరం సీఐ మురళి కిషోర్ తో మాట్లాడుతూ కర్ణాటకతో ఎక్కువ సరిహద్దు ఉన్నందున కర్ణాటక మద్యం మడకశిర గుండా ఆంధ్రాలోకి రాకుండా చూడాలన్నారు.