హిందూపురం తూముకుంట పారిశ్రామిక వాడలో విద్యుత్ షాక్ తో కరెంటు స్తంభం నుండి కింద పడి జూనియర్ లైన్మెన్ రమేష్ మృతి
హిందూపురం రూరల్ తూముకుంట పారిశ్రామికవాడలో విద్యుత్ షాక్ తో జూనియర్ లైన్మెన్ రమేష్(35) అనే వ్యక్తి మృతి చెందాడు,ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న లైన్ మెన్ రమేష్ విద్యుత్ మరమ్మతుల కోసం ఎల్. సి తీసుకొని( లైన్ క్లియర్) ఓ ఫ్యాక్టరీ వద్ద ఓ విద్యుత్ స్తంభం పై హెచ్ ఫీజ్ వైర్లు మారుస్తుండగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు,దీంతో విద్యుత్ స్తంభం పై ఉన్న రమేష్ విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయారు,వెంటనే సమీపవాసులు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు,ఈ విషయం తెలుసుకున్న మృత్తిడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు