76 వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం లో జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. శ్రీ బి.అర్ అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర సమరయోధులను గుర్తు చేసుకుని వారి త్యాగాలను ఈ సందర్బంగా వివరించారు. అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని ఒక తాటిపై నడిపే రాజ్యాంగం మనది. రాజ్యాంగం అనేది కేవలం గ్రంథం కాదు 125 కోట్ల భారతీయుల ఆత్మ. భారతీయ జీవన గమనాన్ని ప్రతిబింబించే విలువైన సాధనం.