అదిలాబాద్ అర్బన్: పట్టణంలో భక్తిశ్రద్ధలతో రామయ్య పాదుకల ఊరేగింపు, అయోధ్యకు సాగనంపిన భక్తులు
ఆదిలాబాద్ లో శ్రీరామ స్వర్ణ పాదుకల ఊరేగింపు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గోపాలకృష్ణ మఠం నుంచి ప్రారంభమైన ఊరేగింపు ప్రధాన వీధుల గుండా సాగింది. ముందుగా స్థానిక డైట్ మైదానంలో కొనసాగుతున్న శ్రీ వైష్ణవ ఆయుత చండీయాగం వద్ద భక్తుల సందర్శన కోసం పాదుకలను ఉంచారు. అనంతరం ఊరేగింపు నిర్వహించి అయోధ్యకు సాగనంపారు. మఠాధిపతి యోగానంద సరస్వతి తదితరులు ఉన్నారు.