చౌటపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడి
జిల్లాలోని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద టార్పాలిన్ కవర్లను సరిపోను అందుబాటులో ఉంచామని, వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు. మంగళవారం హనుమకొండ జిల్లా నడికూడ మండలం చౌటపర్తి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటివరకు చేపట్టిన ధాన్యం కొనుగోలు, చేసిన ఏర్పాట్లను కలెక్టర్ అధికారులు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.