ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు ఉర్దూ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ..
ఎమ్మిగనూరు జడ్పీహెచ్ఎస్ ఉర్దూ పాఠశాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో వసతులపై ఆరా తీశారు. పాఠశాలలో ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.