నిర్మల్: నిర్మల్ జిల్లాలో దసరా, బతుకమ్మ పండుగలకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు
Nirmal, Nirmal | Oct 18, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలో దసరా, బతుకమ్మ పండుగలకు మున్సిపల్ శాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది. వినాయక్ సాగర్ వద్ద నిమజ్జనానికి క్రేన్లు, ఈతగాళ్లను ఏర్పాటు చేశామని వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు. మహాలక్ష్మి ఆలయం వద్ద రావణ దహనానికి బారికేడ్లు, విద్యుత్ దీపాలతో అలంకరణలు చేపట్టారు.