తలమడుగు: రుయ్యాడి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శవయాత్ర, రైతులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట
రెండు లక్షల రుణమాఫీ కాలేదని రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా అన్నదాతల ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో రైతులు,గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించి ఆందోళన చేపట్టారు. అనంతరం సీఎం చిత్రపటానల్ని దగ్ధం చేశారు. శివయాత్రను అడ్డుకున్న పోలీసులకు రైతులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.ఈ మేరకు రైతులు మాట్లాడుతూ రుణమాఫీ చెయ్యని సీఎం వెంటనే రాజీనామా చేయాలన్నారు.