మల్లేపల్లి మిలటరీ హోటల్లో శ్రీవారి ఆనంద నిలయం సెట్ తొలగించాలని స్వామీజీలు ఆందోళన
గత కొద్ది రోజులుగా గండేపల్లి మండలం మల్లెపల్లి హైవేపై ఉన్న రాయడు గారి మిలటరీ హోటల్ లో ఉన్న శ్రీవారి ఆనంద నిలయం సెట్ వివాదంపై పలు హిందూ సంఘాలు జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి టిటిడి కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పటివరకు కూడా ఎటువంటి స్పందన రాకపోవడంతో శనివారం ఏపీ సాధ పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసనంద సరస్వతి స్వామిజి తన అనుచరులతో కలిసి రాయుడు గారు మిలటరీ హోటల్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.హోటల్ యాజమాన్యంతో మాట్లాడుతూ తక్షణం తొలగించాలని శ్రీవారి నమూనాను తొలగించాలని అన్నారు.