చందంపేట: రైతుల భూ సమస్యలపై కలెక్టర్ కీలక ఆదేశాలు: గ్రామసభల్లో సర్వే వివరాలు ప్రదర్శించాలి
దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పర్యటించారు. భూ సర్వే అభ్యంతరాలను రైతులతో చర్చించి పరిష్కరించాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని, మహిళా సంఘాలు సోలార్ ప్లాంట్ల ద్వారా ఆర్థికంగా ఎదగాలని ఆయన దిశానిర్దేశం చేశారు.