నసురుల్లాబాద్: విధుల్లో అలసత్వం వహిస్తున్న ఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్న జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి: విధుల్లో అలసత్వం వహిస్తున్న పోలీసులపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కొరడా ఝులిపిస్తున్నారు. గతంలో ఇద్దరు ఎస్సైలు, హోంగార్డులు, కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. తాజాగా విధుల్లో అలసత్వం వహించిన ఓ ఎస్సై, కానిస్టేబుల్పై చర్యలకు ఉపక్రమించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని దోమకొండ కానిస్టేబుల్ విశ్వనాథ్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పిట్లం ఎస్సై రాజును ఏఆర్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఒకేసారి ఇద్దరు పోలీసులపై ఎస్పీ రాజేష్ చంద్ర క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారు.