జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో రీ సర్వే నిర్వహించి, ముందు గుర్తించిన అంశాలపై సమగ్ర అభివృద్ధి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చెప్పారు. వీధులు విస్తరణ, తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి, వాణిజ్య, సామాజిక మౌలిక వసతుల పనులు దశలవారీగా చేపడతారు.