శ్రీశైలం: శ్రీశైలలానికి పోటెత్తిన భక్తులు. స్వామి అమ్మవార్ల దర్శనం ఎనిమిది గంటల సమయం
శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేసవి సెలవులు మరియు శనివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తుతున్నారు. ప్రస్తుతం స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోందని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు పాలు, మంచినీరు, అల్పాహారం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం కేవలం స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ఈవో వెల్లడించారు.