విశాఖపట్నం: విశాఖ నుంచి హైదరాబాదుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానములో పక్షి ఇరుక్కోవడంతో తప్పిన పెను ప్రమాదం.
విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానము సాంకేతిక లోపంతో వెనదిరిగిన ఘటన గురువారం చోటుచేసుకుంది. బయల్దేరిన 15 నిమిషాలకే ఇంజన్లో సాంకేతిక లోపం లో ఉండటంతో వెంటనే 15 నిమిషాల్లోగా విశాఖ విమానాశ్రయానికి సిబ్బంది ల్యాండ్ చేశారు. అయితే విమానం లో తొమ్మిది బ్లేడ్స్ విరిగిపడ్డాయని అందులోని ఓ పక్షి ఇరుక్కోవడం వల్ల ఈ కారణము ఏర్పడిందని ఏర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు విమానంలో 13 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని అయితే ఎవరికి ఏ విధమైన ప్రమాదము జరగకపోగా వారిని వేరే విమానంలోని వారి గమ్యస్థానానికి పంపించామని తెలిపారు. అయితే ఫ్లైట్ పైలట్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించరన్నారు