పి.గన్నవరం టీడీపీలో అసంతృప్తి సెగలు, మహాసేన రాజేష్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీకి రాజీనామా చేసిన మండల అధ్యక్షుడు
పి.గన్నవరం టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్ పేరును ఆ పార్టీ ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తీవ్ర అసంతృప్తి సెగల కారణంగా పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని శనివారం మూసివేయారు. పార్టీ సీనియర్ నేత డొక్కా నాథ్ బాబు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పి.గన్నవరం టీడీపీ మండల అధ్యక్ష పదవికి తోలేటి సత్తిబాబు రాజీనామా చేశారు.