పార్వతీపురం: కల్లటి వాటర్ ఫాల్స్ రూపురేఖలు మార్చనున్న కలెక్టర్! పర్యాటక కేంద్రంగా అభివృద్ధి
జి.ఎల్. పురం మండలం కల్లటి జలపాతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. స్థానికులకు ఉపాధి, పర్యాటకులకు ప్రత్యేక సౌకర్యాలు, గైడ్ శిక్షణ, హోమ్ స్టే వంటి సౌకర్యాలతో కల్లటి జలపాతాన్ని అభివృద్ధి చేయనున్నారు.