హిందూపురంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా 10 దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు
9 రోజులు ప్రత్యేక పూజలు అందుకోనున్న అమ్మవారు
సత్య సాయి జిల్లా హిందూపురంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహాలు హిందూపురం పట్టణంలో 10 ఏర్పాటు చేయడం జరిగింది. హిందూపురం పట్టణంలోని మోతకుపల్లి ,గాంధీ సర్కిల్ ,ముకడిపేట గరిడీ గణేశా , కంసల పేట ,వీడి రోడ్, లక్ష్మీపురం ,శ్రీకంఠపురం ,చౌడేశ్వరి కాలనీ ,శ్రీకంఠపురం ఆంజనేయ స్వామి గుడి, మున్సిపల్ ఆఫీస్ల వద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద మొత్తం పది దుర్గమ్మ విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రత్యేక అలంకరణలతో తొమ్మిది రోజులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.