పామర్రు: మంటాడ-రెడ్డిపాలెంలో పేకాట శిబిరంపై ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులు, ఐదుగురు అరెస్ట్, రూ.2,100 నగదు స్వాధీనం
పమిడిముక్కల మండలం మంటాడ-రెడ్డిపాలెంలో పేకాట శిబిరంపై ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాబడిన సమాచారం మేరకు మంటాడ-రెడ్డిపాలెంలో పేకాట శిబిరంపై దాడులు నిర్వహించగా ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు రూ.2100 నగదును స్వాధీన పరచుకున్నాం అని తెలిపారు.