పుంగనూరు: చౌడేపల్లెలో 18వ రోజుకు చేరిన వీఆర్ఎల ఆందోళన
తమ సమస్యల పరిష్కారం కోసం వీఆర్ఎలు చేస్తున్న నిరసన 18వ రోజుకు చేరుకుంది. చౌడేపల్లె తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఎలు ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.