శ్రీశైలం: శ్రీశైలం మండలం సున్నిపెంటలో అగ్నికి ఆహుతి అయిన కారు... మంటల్లో కారు పూర్తిగా దగ్ధం
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట డిగ్రీ కళాశాల సమీపంలో ఓ కారు అగ్నికి ఆహుతైంది. హైదరాబాదు నుంచి శ్రీశైలం వైపు ప్రయాణిస్తున్న కారు రోడ్డుపక్కన ఆపిన కొద్దిసేపటికే ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన వాహనదారులు వెంటనే అప్రమత్తమై కారులో నుంచి బయటకు దిగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కారులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.ప్రాథమిక సమాచారం ప్రకారం, కారు ఓవర్‌హీట్ కావడంతో ఇంజిన్‌లో మంటలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అనంతరం మంటలు వేగంగా వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. రోడ్డుపై ఎగసిపడిన మంటలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి.