శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్న గోవా విద్యుత్ మరియు మ్యూజియం శాఖ మంత్రి ధవలేకర్ దంపతులు
గోవా విద్యుత్, మ్యూజియం శాఖ మంత్రి ధవళీకర్ దంపతులు శ్రీశైలం చేరుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద టెంపుల్ ఏఈఓ వెంకటేశ్వరరావు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకున్న ధవళీకర్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి మండపంలో వేదఆశీర్వచనం అందించగా, స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను టెంపుల్ ఏఈఓ వెంకటేశ్వరరావు, అర్చకులు అందజేశారు.