సిరిసిల్ల: KVPS జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలి: జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు
సిరిసిల్ల పట్టణంలో సెప్టెంబర్ 23,24 తేదీల్లో జరిగే KVPS జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 23,24 తేదీలలో జిల్లా వస్త్ర పరిశ్రమ భవన్లో జిల్లా మహాసభలు జరుగుతున్నట్లు తెలిపారు. జిల్లాలో కుల వివక్ష, అంటరానితనం, దళితులపై దాడులు వంటి సమస్యలపై కెవిపిఎస్ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. సామాజిక న్యాయం కోసం అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం సైకిల్ యాత్రలు,చర్చ గోస్టులు, సదస్సులు, సెమినార్లు, ధర్నాలు, ఎన్నో పోరాటాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరిచిందని అన్నార