గుంతకల్లు: గ్యాస్ కొరత ఉందని అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటాం: గుత్తిలో డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరిక
గుత్తిలో ఎలాంటి గ్యాస్ కొరత లేదు. గ్యాస్ కొరత ఉందని అసత్య ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. గుత్తిలోని సీఐ ఆఫీసులో మంగళవారం ఉదయం 11:40 గంటల సమయంలో ఆయన సీఐ రామారావు, ఎస్ఐ సురేష్, సీ ఎస్ డీ టీ సురేఖ లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ కొరత అనేది లేదన్నారు. కేవలం మూడు వారాల్లో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు 19 వేల గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారన్నారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా గ్యాస్ కొరత వల్ల అని చెప్పడం మంచిది కాదన్నారు. అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.