శ్రీశైలం: శ్రీశైలం మహాక్షేత్రంలో సాంకేతిక లోపంతో పని చేయని దేవస్థాన వెబ్ సైటు. ఇబ్బందులు పడ్డ భక్తులు
శ్రీశైలం మహాక్షేత్రంలో సాంకేతిక లోపంతో శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రధాన ఆలయాల్లో సర్వర్ సమస్య కారణంగా ఆన్‌లైన్ సేవలు గత నాలుగు గంటలుగా నిలిచిపోయాయి. దీంతో దర్శనం, వసతి తదితర టికెట్ల బుకింగ్‌లు నిలిచిపోగా భక్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు అప్రమత్తమై కౌంటర్ల వద్ద ఈ-పోస్ మిషన్ల ద్వారా కరెంట్ బుకింగ్ పద్ధతిలో టికెట్లు జారీ చేస్తున్నారు. సాంకేతిక లోపాన్ని త్వరగా సరిచేసేందుకు ఐటి బృందం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.