కర్నూలును స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపుకు 27 జెసిబిలతో ప్రత్యేక డ్రైవ్ ప్రారంభమైంది. ఐదు రహదారుల కూడలి సమీపంలోని పాత ఎస్పీ బంగ్లా వద్ద నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన పిచ్చి మొక్కలను తొలగించడంలో స్వచ్ఛంద సంస్థల సహకారం అభినందనీయమని పేర్కొంటూ, శుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని కమిషనర్ పిలుపునిచ్చారు.